ఈడీ దాడులపై ఆప్‌ ఫైర్

2
- Advertisement -

పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరుపుతున్న దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు బల్తేజ్ పన్ను… ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారులు, నాయకులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఈడీ “పంజాబ్‌లో దొంగల్లా తిరుగుతోంది అని ఆరోపించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్)లో ఒక ఘాటైన పోస్ట్ చేస్తూ..పంజాబ్ ఎన్నికలకు ముందు, ఈడీ బృందాలు నిన్నటి నుండి అధికారులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నాయి. నరేంద్ర మోదీ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇది మోదీ భయానికి నిదర్శనం. దేశ ప్రజలు తనను అసహ్యించుకోవడం ప్రారంభించారని ఆయన గ్రహించారు అన్నారు.

Also Read:ఆ బ్యాంకులు ఆదివారం ఓపెన్!

ఇప్పుడు ఈడీ పంజాబ్‌లోని ఇంటింటికీ వెళ్తూ ప్రజల ఇళ్లను ధ్వంసం చేస్తోంది. మోదీ ఈడీ పంజాబ్‌లో దొంగల్లా తిరుగుతోంది. ఇటువంటి అణచివేతను, దౌర్జన్యాలను పంజాబ్ ఎంతమాత్రం సహించదు అని తేల్చిచెప్పారు.

- Advertisement -