ఆసియా క్రీడల్లో మెరిసిన భారత్

2
- Advertisement -

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం, 6 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు సాధించింది.గురువారం ఉదయమే భారత్ రెండు పతకాలతో శుభారంభం చేసింది. మహిళల వూషూ 60 కేజీల సాండా విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాఓయు ఝాంగ్‌ చేతిలో ఓడిపోయిన రోషిబినా దేవి రజత పతకాన్ని కైవసం చేసుకోగా, పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్ ఈవెంట్‌లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ ద్వయం కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఆసియా క్రీడల భారత జట్టు ఎంపికపై వచ్చిన వివాదాలను పక్కన పెట్టి, స్టార్ వూషూ అథ్లెట్ రోషిబినా దేవి మహిళల 60 కేజీల సాండా ఈవెంట్‌లో రజత పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. సెలక్షన్ ట్రయల్స్‌లో యువ అథ్లెట్ దివ్యాంశి చౌదరి చేతిలో రోషిబినా ఓడిపోయినప్పటికీ, దివ్యాంశి గాయపడటంతో రోషిబినాకు జట్టులో అవకాశం లభించింది.

ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ఝాంగ్ జియాఓయు చేతిలో రోషిబినా 0-5 తేడాతో రెండు రౌండ్లలోనూ ఓడిపోవడంతో మ్యాచ్ 2-0తో చైనా క్రీడాకారిణి సొంతమైంది.25 ఏళ్ల రోషిబినాకు ఇది వరుసగా మూడో ఆసియా క్రీడల పతకం.

2018 జకార్తా-పాలెంబాంగ్ ఆసియా క్రీడల్లో: కాంస్యం

2023 హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో: రజతం

ఆసియా క్రీడల వూషూ విభాగంలో వరుసగా మూడు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రోషిబినా దేవి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఆమె 2023 ప్రపంచ ఛాంపియన్ వియత్నాంకు చెందిన గుయెన్ థి తు థుయ్‌పై ఘనవిజయం సాధించగా, బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన థానియా కుసుమానింగ్‌త్యాస్‌ను 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరింది.

Also Read:ఆ బ్యాంకులు ఆదివారం ఓపెన్!

రోయింగ్‌లో సత్నామ్ – సల్మాన్ జోడీకి కాంస్యం
నాగరాగావా ఇంటర్నేషనల్ రెగట్టా కోర్సులో జరిగిన పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్ ఫైనల్లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జంట 6:13.25 సమయంతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

రేసులో 1,500 మీటర్ల మార్క్ వరకు రెండో స్థానంలో ఉన్న ఈ భారత ద్వయం, చివరి 500 మీటర్లలో మూడో స్థానానికి పడిపోయింది. చైనాకు చెందిన యి క్షుడి, యిడే నీ జోడీ 6:09.37 సమయంతో స్వర్ణం సాధించగా, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పావెల్ సోరిన్, మెఖ్రోజ్బెక్ మమత్కులోవ్ జోడీ 6:10.49 సమయంతో రజతం గెలుచుకుంది. విజేత కంటే భారత జోడీ 3.88 సెకన్ల వ్యవధిలో నిలిచింది.

- Advertisement -