ఓటీటీలోకి ఆ ఒక్కడు అడక్కు!

21
- Advertisement -

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

వెండితెరపై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గణ(అల్లరి నరేష్) ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఏజ్ పెరిగినా పెళ్లవ్వదు. ఇంట్లో తమ్ముడికి(రవికృష్ణ) ఆల్రెడీ తన మరదలితో(జెమీ లివర్) పెళ్లి అయిపోతుంది. వాళ్లకి ఓ పాప కూడా ఉంటుంది. ఓ సమయంలో అనుకోకుండా గణ వల్ల ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గణ పెళ్లి అయిందా? సిద్ధి ఓకే చెప్పిందా? అన్నదే సినిమా కథ.

Also Read:ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..

- Advertisement -