శ్రీవారికి ఐదున్నర కిలోల స్వర్ణ హస్తాలు అందజేసిన భక్తుడు..

361
Gold
- Advertisement -

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఐదున్నర కిలోల స్వర్ణ హస్తాలు అందజేశారు చైన్నైకి చెందిన భక్తుడు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు.స్వామికి భక్తులు ఇచ్చే కానుకులను మాత్రం లెక్కగట్టేందుకు కొన్ని శాసనాలు రికార్డులు ఉన్నాయి. ఒకప్పుడు దాతలు ఇచ్చిన కానుకలే స్వామి సేవలకు వినియోగించేవారు.

కైంకర్యాలు మొదలుకుని, ఆభరణాల వరకూ చాలా సామాగ్రి దాతలు ఇచ్చినవే కావడం విశేషం.ఈ కానుకలకు చరిత్ర ఉంది.ఇలా తొలికానుక ఇచ్చిన వారు పల్లవరాణి సమువాయిగా చెబుతున్నారు. సమువాయి స్వామికి పరమభక్తురాలు. ఆమె తరచూ శ్రీవారిని దర్శించుకునేవారు.

అలా అక్కడ స్వామి సేవకు కావలసిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె కీ.శ.614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. నాటి పల్లవుల నుంచి రాయల వరకు ఎన్నో కానుకలను ఇచ్చారు.అయితే శ్రీవారికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు విరాళాన్ని అందజేశాడు. రూ.2.25 కోట్ల విలువైన 6 కేజీల కటిక, అభయ హస్తం విరాళంగా ఇచ్చాడు.

- Advertisement -