కథువా దోషులకు జీవిత ఖైదు..

396
kathuva incident
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్ న్యాయస్థానం కీలకతీర్పు వెలువరించింది.ముగ్గురు నిందితులకు దీపక్‌,సాంజీరామ్‌,పర్వేష్‌లకు జీవిత ఖైదు విధించిన న్యాయస్ధానం ముగ్గురు పోలీసులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షవిధించింది.సాంజీ రామ్‌ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

గతేడాది జనవరిలో జమ్ముకశ్మీర్‌లోని కథువాకు చెందిన 8ఏళ్ల చిన్నారిని అతి పాశవికంగా అత్యాచారం చేసి చంపిన విషయం తెలిసిందే. కథువాలోని రసానా గ్రామానికి చెందిన ఈ చిన్నారి 2018 జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని ఓ అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. బాలికను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత హ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంజీరామ్‌తో పాటు ఏడుగురిని నిందితులుగా చేర్చారు.

తొలుత ఈ కేసును క్రైమ్‌ బ్రాంచీకి అప్పగించింది. అయితే దర్యాప్తునకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.

- Advertisement -