రోజాకు కీలక పదవి అప్పజెప్పిన జగన్….ఇక చంద్రబాబుకు చుక్కలే

386
Roja chandrababu
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందింది సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా. టీడీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పడంలో రోజా చాలా ముందు ఉంటుందని చెప్పుకోవాలి. ఏపీలో ఐరన్ లెగ్ గా పేరున్న ఆమె వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. ఇటివలే జరిగిన ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి టీడీపీ చాలా ప్రయత్నాలు చేసిన చివరకు రోజానే గెలిసింది. టీడీపీ ప్రభుత్వంలో రోజాను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా పలుమార్లు సస్పెండ్ చేశారు. తాము అడిగే ప్రశ్నలకు జవాబులు లేకపోవడంతో తనను సస్పెండ్ చేస్తున్నారని రోజా అప్పట్లో చంద్రబాబుపై ఫైర్ అయింది.

అయితే ఇప్పుడు వైసిపి అధికారంలోకి రావడంతో రోజాకు కీలక పదవి దక్కనుందని తెలుస్తుంది. ఏ స్పీకర్ తో అయితే రోజా ను సస్పెండ్ చేశారో అదే స్పీకర్ స్ధానంలో రోజాను కూర్చోబెట్టనున్నారు జగన్. ఇక రోజా స్పీకర్ చైర్ లో కూర్చుంటే చంద్రబాబుకు చుక్కలే అని చెప్పుకోవాలి. ఎవరైతే ఆమెను దూషించారో.. అదే నోటితో అధ్యక్షా… అని పిలిపించుకోబోతుంది రోజా. దీనికోసమే రోజా ఎదురు చూస్తున్నది. జగన్ స్పీకర్ పదవి ఆఫర్ చేసినపుడు వెంటనే ఆమె కాదనకుండా ఒప్పుకోవడానికి ఇదే రీజన్ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే స్పీకర్ హోదాలో రోజా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి రోజా అనుకున్నది సాధించుకోబోతున్నది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మరి.

- Advertisement -