సీఎం అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదని..చౌకీదార్‌గా తనకు తాను అభివర్ణించుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఖరీదైన సూట్స్‌ను ధరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. మోడీ ధరించే సూట్ విలువ పది లక్షలకు పైనే. ఈ నేపథ్యంలో మోడీపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోరు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మేకప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను మేకప్ వేసే ఆర్టిస్ట్‌కు ప్రతినెలా రూ.80 లక్షలు చెల్లిస్తున్నారని లక్మణ్ రమీజ్ అనే ఫేస్ బుక్ యూజర్ పోస్ట్ చేశారు. ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తన పోస్టులో పేర్కొన్నారు.ఇందుకు సంబంధించి ఓ వీడియోను సైతం పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను 17 వేలకు పైగా మంది షేర్ చేయగా 4లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అయితే వాస్తవానికి మోడీ తన మేకప్ ఆర్టిస్ట్‌కు నెలకు రూ.80 లక్షలు చెల్లిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు. మేకప్ నిమిత్తం ప్రధాని ఎంత ఖర్చు చేశారన్నదానిపై ఆర్టీఐ సమాధానమిచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 2016 సంవత్సరవంది. మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో మోడీ మైనపు బొమ్మ కోసం కొలతలు సేకరించారు. అప్పటివీడియోకు ప్రధాని మేకప్ ఆర్టిస్టు కోసం 80 లక్షలు ఖర్చుచేస్తున్నారనే వీడియోని జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అది ఫేక్ అయినా వైరల్‌గా మారింది.