ట్రాఫిక్ పోలీసులపై వీహెచ్‌ గుస్సా…

219
vh

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) తనదైన శైలీలో నిప్పులు చెరిగారు. ఎండలో వాహనదారుల్ని చలానాల పేరుతో వేధిచొద్దని ఎండలో నిలబెట్టి పరేషాన్‌ చేయవద్దని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

లకిడీకపూల్‌ ఏజీ ఆఫీస్ నుండి వెళ్తున్న వీహెచ్‌ ట్రాఫిక్ పోలీసులు చలనాలు విధిస్తుండటం చూసి కారు ఆపి పోలీసుల తీరుపై మండిపడ్డారు.ఎండలకు బయటకు రావడానికే జనాలు ఇబ్బంది పడుతుంటే.. ఎండలో ఆపి చలాన్లు రాయడం ఏంటని ప్రశ్నించారు. ఛల్.. ఛల్‌ అంటూ వాహనదారులను అక్కడినుండి పంపించేశారు.

దీంతో పోలీసులు వాహనదారులను అక్కడినుండి పంపించేశారు. అనంతరం వీహెచ్‌ అక్కడి నుండి కారెక్కి వెళ్లిపోయారు.