ఏప్రిల్ నెలలో బ్యాంకు లావాదేవీలు ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పండగల కారణంగా వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాలు, చెక్స్ డిపాజిట్స్, డిడిలు జమయచేయడం వంటివి ముందుగానే చేయడం మంచిది. లేదంటే మీ లావాదేవీలకు దెబ్బ పడే అవకాశం ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, నాలుగో శనివారాలు అంటే ఏప్రిల్ 13,27 తేదీలు బ్యాంకులు మూసివేయబడతాయి. సాధారణంగా ఓ నెలలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కాకుండా ఏదైనా ఒకటి రెండు పండుగలు వస్తాయెమో కానీ.. ఏప్రిల్ లో మాత్రం చాలా సెలవులు వచ్చాయి.
ఏప్రిల్ 1న మే డే సెలవు అయిపోయింది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న ఉగాది, ఏప్రిల్ 7న ఆదివారం, ఏప్రిల్ 13న రెండో శనివారం, ఏప్రిల్ 14న ఆదివారం, ఏప్రిల్ 17న మహవీర్ జయంతి, ఏప్రిల్ 19న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 21న ఆదివారం, ఏప్రిల్ 27న నాలుగో శనివారం, ఏప్రిల్ 28న ఆదివారం. ఏప్రిల్లో మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. మరి అందుకే సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి..!