బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీఒక్కరు చూడాల్సింది..!

380
banks
- Advertisement -

మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుకోవల్సిందే. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్ట్ నెల రెండో వారంలోని ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆగస్టు 10వ తేదీన రెండో శనివారం కారణంగా బ్యాంకులు పనిచేయవు. తరువాతి రోజు ఆదివారం. మరుసటి రోజు సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు. దీంతో బ్యాంకులు వరుసగా 3 రోజులు పనిచేయవు.

ఆగస్టు 12 అనంతరం 2 రోజులు బ్యాంకులు తెరిచే ఉంటాయి. మళ్లీ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో 6 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు.

- Advertisement -