తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్దుల సెకండ్ లిస్ట్…

255
uttamkumar
- Advertisement -

తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీ అధిష్టానం తొలి విడదలో 8మంది అభ్యర్దుల పేర్లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సెకండ్ లిస్ట్ లో మరో 8మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. మొత్తం 16స్ధానాలకు అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ స్ధానాన్ని మాత్రం పెడింగులో పెట్టింది. ఖమ్మం సీటు కోసం మాజీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావుతో పాటు, రేణుక చౌదరిలు పోటీ పడుతున్న నేపధ్యంలో ఈసీటు ను తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇక నిన్న అర్ధరాత్రి ప్రకటించిన లిస్ట్ లో నల్లగొండ పార్లమెంట్ స్ధానం నుంచి టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిజామాబాద్ మధుయాష్కి, మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, సికింద్రబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య , హైదరబాద్ పార్లమెంట్ స్ధానం నుంచి ఫిరోజ్ ఖాన్ పేర్లను ఖరారు చేశారు.

- Advertisement -