మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కి గురైన భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య,లోకేష్ రాహుల్‌లకు బాసటగా నిలిచారు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. పాండ్యా, రాహుల్ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదని సూచించాడు.
మనం ముందుగానే ఫిక్స్ చేసినట్టుగా అన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలని లేదన్నారు. చేసిన తప్పును తెలుసుకుని వారు కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దామని మనం బతుకుదాం. ఇతరులకు బతకనిద్దాం అని తెలిపారు.
తన తప్పు తెలుసుకున్న పాండ్యా కనీసం ఇంటి నుంచి వెలుపలకి కూడా రావడం లేదని అతని తండ్రి హిమాన్షు పాండ్య వెల్లడించాడు. ఇటీవల కేఎల్ రాహుల్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన హార్దిక్ పాండ్య.. అమ్మాయిలతో డేటింగ్, పార్టీల్లో వారిని చూసే విధానంపై అభ్యంతరకంగా మాట్లాడాడు. దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.