ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్..

339
kcr
- Advertisement -

తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో తొలుత ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్‌. అనంతరం రేఖానాయక్(టీఆర్‌ఎస్), డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్), గొంగిడి సునీత(టీఆర్‌ఎస్), హరిప్రియ బానోతు(కాంగ్రెస్), పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్), సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -