అమీర్ పేట‌లో ‘సాహో’ షూటింగ్..

357
sahoo prabhas
- Advertisement -
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్  బాహుబ‌లి సినిమా త‌ర్వాత సాహోలో న‌టిస్తున్నాడు. ఈమూవీకి యువ ద‌ర్శ‌కుడు సుజిత్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్దా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. యూవీ క్రియేష‌న్స్ సంస్ధ వారు భారీ బడ్జెట్ తో ఈమూవీని నిర్మిస్తున్నారు. పూర్తిగా యాక్ష‌న్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈమూవీలో ప‌లువురు బాలీవుడ్ న‌టులు న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  హాలివుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయనేది టీజర్ చూస్తేనే స్పస్టం అయిపోయింది. RFCలో అతి పెద్ద యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న సాహో.. మరో భారీ సన్నివేశాల షూటింగ్ కోసం రెడీ అవుతోంది.
sahoo
తాజాగా ఈమూవీ అమీర్ పేట్ లో , కృష్ణా న‌గ‌ర్ ఏరియాల్లో షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్లు తెలుస్తుంది.ఇందుకోసం  ఇప్పటికే ఏరియాలు అన్నీ కూడా పరిశీలించారు. గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీని ఏర్పాటు చేసి షూటింగ్ జ‌రుప‌నున్న‌ట్లు స‌మాచారం. అమీర్ పేటలో జరిగే షూటింగ్ లో హీరో ప్రభాస్ తోపాటు హీరోయిన్ శ్రద్ధాకపూర్, ఇతర కీలకమైన నటులు అందరూ కూడా పాల్గొంటున్నారని స‌మాచారం.
- Advertisement -