త‌మిళ్ టెంప‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

237
vishal
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌పుడు టెంప‌ర్ సినిమాతో భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన ఈసినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు. టెంప‌ర్ సినిమాను త‌మిళ్ లో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ్ లో ప్ర‌ముఖ హీరో విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ‘అయోగ్య’ టైటిల్ తో ఈ సినిమాను వెంకట్ మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

temper

 

ప్ర‌ముఖ నిర్మాత‌ ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ మురుగ‌దాస్ విడుద‌ల చేశారు. తమిళ్ లో మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువల్ల‌ ఈ కథ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. విశాల్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా క‌థానాయిక‌గా నటిస్తున్నారు. 2019 జనవరిలో అయోగ్య రిలీజ్ కానుంది.

- Advertisement -