2.0 సెన్సార్ పూర్తి..

220
rajani 2.0
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. టీజర్,ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన శంకర్‌ 2.0 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఒక్క కట్ లేకుండా సెన్సార్‌ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండున్నర గంటలు నిడివి గల ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే కొన్ని పదాలను మాత్రం పైకి వినిపించకుండా చేయాలని సూచించింది.

2.0ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.

ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాట‌లు, ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సోష‌ల్ మీడియాలో 2.0 ట్రైల‌ర్‌, పాట‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు పదివేల థియేటర్లలో 2.0 విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -