టెస్టు, వన్డే సిరీస్‌ల్లో కరీబియన్లను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌నూ అలవోకగా హస్తగతం చేసుకుంది. లక్నో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుపై 71 పరుగుల తేడాతో గెలుపొంది, మూడు మ్యాచ్‌లసిరీస్‌లో రెండు గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పాయి క్రికెట్ స్టేడియంలో భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు బ్రావో 23, పాల్ 20, హెట్‌మేయర్ 15, బ్రాత్‌వైట్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లు భువనేశ్వర్, ఖలీల్, బుమ్రా, కుల్‌దీప్‌లకు చెరో రెండు వికెట్లు లభించాయి. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ నాటౌట్ 111; ధావన్ (సి) పూరన్ (బి) అలెన్ 43; రిషబ్ పంత్ (సి) హెట్‌మయర్ (బి) పియర్ 5; కేఎల్ రాహుల్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 195;
వికెట్ల పతనం: 1-123, 2-133;
బౌలింగ్: థామస్ 4-1-27-0; కీమో పాల్ 4-0-30-0; పియర్ 4-0-49-1; కార్లోస్ బ్రాత్‌వైట్ 4-0-56-0; అలెన్ 4-0-33-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) ఖలీల్ 6; హెట్‌మయర్ (సి) ధావన్ (బి) ఖలీల్ 15; డారెన్ బ్రావో (సి) రోహిత్ (బి) కుల్‌దీప్ 23; రామ్‌దిన్ (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 10; పూరన్ (బి) కుల్‌దీప్ 4; పొలార్డ్ (సి) అండ్ (బి) బుమ్రా 6; బ్రాత్‌వైట్ నాటౌట్ 15; అలెన్ రనౌట్ 0; కీమో పాల్ (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 20; పియర్ (సి) అండ్ (బి) బుమ్రా 1; థామస్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124;
వికెట్ల పతనం: 1-7, 2-33, 3-48, 4-52, 5-68, 6-81, 7-81, 8-114, 9-116;
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-12-2; ఖలీల్ అహ్మద్ 4-0-30-2; బుమ్రా 4-0-20-2; కృనాల్ పాండ్య 4-0-23-0; కుల్‌దీప్ యాదవ్ 4-0-32-2.