విశ్వ విలక్షణ నటుడిగా పేరున్న కమలహాసన్ గారాల కూతురిగా సినీ ఇండస్ట్రీ కి పరిచయమైనా శృతి హాసన్ తన తల్లిదండ్రుల పేరు వాడకుండా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది. విజయాలు, అపజయాలు ఎన్ని ఎదురవుతున్నా సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని బయటపెట్టింది శృతి.
ఆదివారం రాత్రి ముంబై లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సందడి చేసిన శృతి హాసన్, మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, తన అమ్మతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభిచినట్టు, ఇంతవరకు తన తండ్రితో కలిసి పని చేయగా ఇకనుంచి తన తల్లి తో కలిసి పని చేయబోతున్నట్టు తెలిపింది శృతి హాసన్.
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో తన ఉనికి తగ్గడానికి కారణమేంటి అని విలేఖరి ప్రశ్నించగా, తనలాంటి ఆర్టిస్ట్ లు అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే స్థిత ప్రజ్ఞత పెరుగుతుందని, అంతేకాకుండా తాను నిర్మించిన నిర్మాణ సంస్థ గురించి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపింది శృతి హాసన్. ముందు ముందు సినిమాలే కాకుండా తనకి ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్స్ ని కూడా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పింది శృతి హాసన్ ప్రస్తుతం శృతి నటించిన కమలహాసన్ సినిమా శభాష్ నాయుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, హిందీ లో శృతి మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.