డీఎంకే పార్టీ అధినేత‌గా ఎంకే స్టాలిన్ ఎన్నిక..

221
MK Stalin
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి తర్వాత డీఎంకేలో ఆధిపత్య పోరు మొదలైన సంగతి తెలిసిందే. పార్టీ చీఫ్ పదవి కోసం స్టాలిన్, పార్టీ కోశాధికారి పదవికి సీనియర్ నేత ఎస్.దురై నామినేషన్ పత్రాలు సమర్పించగా డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షుడితోపాటు కోశాధికారిని ఎన్నుకున్నారు. డీఎంకే పార్టీ అధినేత‌గా ఎంకే స్టాలిన్.. డీఎంకే పార్టీ ట్రెజ‌ర‌ర్‌గా దురై మురుగ‌న్‌ను ఎన్నుకున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్టాలిన్‌ను అధినేత‌గా ఎన్నుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 70ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడు. గత 50 ఏళ్లుగా కరుణానిధి అధ్యక్షుడిగా ఉండగా.. ఇప్పుడు స్టాలిన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

MK Stalin

14 ఏళ్ల వయసు నుంచే స్టాలిన్ పార్టీకి సేవలు అందించారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు ప్రత్యేక స్థానం కల్పించారు క‌రుణానిధి. మాజీ సోవియట్ యూనియన్ నేత అయిన జోసెఫ్ స్టాలిన్ పేరును స్పూర్తిగా తీసుకుని తన కుమారుడికి పెట్టుకున్నారు కరుణానిధి. మ‌రోవైపు పార్టీ చీఫ్ పదవి కోసం స్టాలిన్‌పై ఆయన సోదరుడు అళ‌గిరి తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవ‌ల మాజీ సీఎం, డింఎకే చీఫ్ క‌రుణానిధి మ‌ర‌ణించ‌డంతో ఆ పార్టీ ప్రెసిడెంట్ స్థానానికి ఇవాళ ఎన్నిక నిర్వ‌హించారు.

అయితే 1977లో ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన తొలిసారి 1989లో అసెంబ్లీ సీటు గెలిచారు. మళ్లీ రెండేళ్లకు జరిగిన పోల్స్‌లో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన మళ్లీ ఓటమి ఎదుర్కోలేదు. 1996లో స్టాలిన్ చెన్నై మేయర్‌గా చేశారు. అప్పుడు ఆయన సత్తా ఏంటో చాటారు. పరిపాలనను ఆధునీకరించేందుకు ఆయన ఎన్నో చర్యలు చేపట్టారు. గడిచిన 50 ఏళ్లుగా డీఎంకే పగ్గాలు కరుణ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో వ‌చ్చిన‌ స్టాలిన్ ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలే స్టాలిన్ సత్తాకు గీటురాయి కానున్నాయి.

- Advertisement -