ఐసీసీతో కలిసి పని చేస్తాం : కేటీఆర్

216
ktr icc
- Advertisement -

గత రెండు దశాబ్దాలలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పార్క్‌ హయత్‌లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదరన్ రీజినల్ కౌన్సిల్(ఐసీసీఎస్‌ఆర్‌సీ) సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్…హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐకేసీలాంటి ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్‌కు రావడం సంతోషకరమని మరెన్నో సంస్థలు త్వరలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పారు.

ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్ధానంలో ఉందన్నారు. నాలుగేళ్లలో ఎన్నో రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనమతులు ఇస్తున్నామని చెప్పారు.

- Advertisement -