నర్తనశాల నుంచి ‘ఎగిరెనే మనసు’ వీడియో సాంగ్..

292
-Narthanasala-Egireney-Manasu-Video-Song
- Advertisement -

యంగ్ హీరో నాగశైర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నర్తనశాల అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి పరిచయం కాబోతున్నారు. మొదటి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు చక్రవర్తి.ఈ చిత్రినానికి నాగశైర్యనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడునాగశైర్య. ఈ చిత్రంలో నాగ శౌర్యకు జోడీగా కాష్మీర నటిస్తోంది.

Narthanasala

తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను నేడు విడుదల చేశారు. ఎగిరెనే మనసు అంటూ సాగే ఈ మెలోడి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. స్వర సాగర్ పాడాడు. మెలోడి సాంగ్ తో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య. ఈ పాటను చూస్తుంటే.. ఛలో సినిమాలోని చూసి చూడంగానే పాటప గుర్తుకు రావడం ఖాయం అంటున్నారు. మీరు ఒక లుక్కెయ్యండి మరి.

- Advertisement -