ఎంపీ సంతన్న సవాల్‌ను స్వీకరించిన నాగార్జున..

199
MP Santosh Kumar

పచ్చ‌ని మొక్క ప్ర‌ణ‌వాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మ‌నిషిని కాపాడుతుంది. నిరంత‌ర కాలుష్యంతో ప్ర‌మాద‌పుటంచును తాకుతున్న మాన‌వాళిని జాగృతం చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌లు అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ‌ సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన ఉద్య‌మ‌మే హ‌రిత‌హారం. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంచుకున్న మార్గమిది. మొక్క‌లు నాట‌డ‌మే దీని ఉద్ధేశ్యం. ఈ హరితహారం కార్యక్రమంలో మేము సైతం అంటూ ప‌లువురు రాజకీయ ప్రముఖులు, సినీతార‌లు ముందుకొచ్చారు.

Nagarjuna Accepted Green Challenge

ఈ హరితహారం ఛాలెంజ్‌లో భాగంగా..ఇటీవల తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సవాల్‌ను విసిరాడు. అయితే హోం మినిస్టర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి స్వయంగా మొక్కలను నాటారు ఎంపీ సంతోష్ కుమార్. అంతేకాదు ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు ఈ హరితహారం ఛాలెంజ్‌ను విసిరారు. రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడుక, గవర్నర్ నరసింహన్, హీరో నాగార్జునకి ఛాలెంజ్ విసిరారు. తాజాగా ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్ చేసినందుకు థాంక్యూ ఎంపీ సంతోష్ గారు. నేను నా యాక్సెప్టెన్స్‌కి ప్రూఫ్ త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే నేను నా ఫ్రెండ్స్‌లో కొందరిని ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లమని కోరుతాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Governor Narasimhan

ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తోపాటు ఆయన సతీమణి విమల నరసింహన్, రాజ్‌భవన్ అధికారులు కూడా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటి… ఆరోగ్యకరమైన వాతావరణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలా హరితహారం ఛాలెంజ్‌కు ఎంతో మంది ప్రముఖుల నుండి మంచి స్పందన లభిస్తోంది.