భారత్‌తో వన్డే సిరీస్‌…ఇంగ్లాండ్ జట్టు ఇదే

273
england cricket team
- Advertisement -

భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్‌ వన్డే జట్టును ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. గాయంతో కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్‌ను తిరిగిజట్టులోకి తీసుకుంది. మొత్తం 14 మంది ప్రాబబుల్స్‌లో మరో ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్‌కు చోటు కల్పించలేదు. భారత్‌తో మూడు వన్డేలు ఆడనుంది ఇంగ్లాండ్. జూలై 12న ట్రెంట్ బ్రిడ్జి వేదికగా తొలి వన్డే జరగనుంది.

ఆసీస్‌ను 5-0తో వైట్ వాష్‌ చేసిన ఇంగ్లీష్ టీమ్‌ అదే ఉత్సాహంతో టీమిండియాను ఓడించేందుకు ఉవ్విళ్లూరుతోంది. స్టోక్స్ రాక ఇంగ్లాండ్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జాన్ బెయిర్‌స్టో, జేక్ బాల్, జాస్ బట్లర్ టామ్ కర్రాన్, అలెక్స్ హేల్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్.

ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో భారత్ ఇవాళ రెండో టీ20లో ఆ జట్టుతో తలపడనుంది. తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో టీ20లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ పూర్తికాగానే టీమిండియా జట్టు ఇంగ్లాండ్ కు పయనం కానుంది.

- Advertisement -