వైయ‌స్ఆర్ బ‌యోపిక్ ప్ర‌చారంలో ప్ర‌భాస్…

265
ysr biopic, prabhas
- Advertisement -

బాలీవుడ్ టూ టాలీవుడ్ వ‌ర‌కూ ఎక్క‌డ చూసుకున్నా ప్ర‌స్తుతం బ‌యోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. అలనాటి న‌టి అందాల తార సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన మ‌హాన‌టి మూవీ భారీ విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. అదే బాట‌లో మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కుతుండ‌గా..అలాగే మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ ఆర్ జివిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా యాత్ర‌. మ‌హి వి. రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Prabhas

ఇటివ‌లే ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించారు. ఆనందో బ్ర‌హ్మ సినిమా నిర్మాత విజ‌య్ యాత్ర సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. యాత్ర మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాల్గోనేందుకు ఓకే చెప్పేశాడ‌ని తెలుస్తుంది.

yatra movie

ఈ చిత్ర నిర్మాత విజ‌య్ హీరో ప్ర‌భాస్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అవ‌డంతో యాత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గోనేందుకు అంగీక‌రించాడు ప్ర‌భాస్. యాత్ర క‌థ కూడా చాలా బాగా ఉంద‌ని…బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గొంద‌ని ప్ర‌భాస్ నిర్మాత విజ‌య్ కి సూచించాడ‌ని స‌మాచారం. ఈసినిమా ప్ర‌మోష‌న్స్ కోసం నిర్మాత విజ‌య్ చాలా మంది హీరోల‌ను సంప్ర‌దించాడ‌ని తెలుస్తుంది. ఈమూవీలో వైఎస్సార్ పాత్ర‌లో ముమ్మ‌ట్టి న‌టిస్తుండ‌గా, విజ‌య‌మ్మ పాత్ర‌లో బాహుబ‌లి ఫేం అశ్రిత వేముగంటి న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌వి లో యాత్ర మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -