ఆధ్యాత్మిక ముసుగులో అత్యాచారాలకు పాల్పడిన డేరాబాబా గుర్తున్నాడా..? అదేనండి డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హా ఇప్పుడు గుర్తొచ్చాడు కదా..? మహిళలపై అత్యాచారం కేసులో రోహ్‌తక్ జైల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన జైల్లో ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? అక్షరాల రూ. 20 రోజుకు సంపాదిస్తున్నాడు.
ఆయన కోసం జైల్లో 0.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో డేరాబాబా కూరగాయలు పడిస్తున్నాడు. టొమాటోలు, బంగాళ దుంప, అనేక రకాల కూరగాయలు పడిస్తున్నాడు. పండించిన ఈ కూరగాయలను జైల్లో వంటకు ఉపయోగిస్తున్నారు అధికారులు. జైల్లో కష్టపడి పనిచేయడంతో ఆరు కిలోల బరువు తగ్గారట. అప్పటి కంటే ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నారట.
జైల్లో ఖైదీలు సంపాదించిన డబ్బులను, వారి అకౌంట్లలో వేస్తుంటారు. కానీ డేరాబాబా అకౌంట్లు హర్యానా ప్రభుత్వం బ్లాక్ చెయ్యడంతో సంపాదించిన రూ.20 కూడా అందడం లేదట. రోజుకు రెండు గంటలపాటు శ్రమిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది ఈ బాబాకి. ఇక జైల్లోని వారికి ఆధ్యాత్మిక బోధనలు చెప్పడానికి పర్మిషన్ ఇవ్వాలని డేరాబాబా ప్రభుత్వానికి కోరాగా.. ప్రభుత్వం అందుకు నిరాకరించింది.