వ్యవసాయం చేసుకుంటా.. బెయిల్ ఇవ్వండీ..

275
Dera baba
- Advertisement -

నేనే దేవుడ్ని.. నాకు మీరంతా భక్తులుగా ఉండండి.. నా సేవలో తరించండి అంటూ నమ్మించటం ఒక ఎత్తు. దాన్ని తనను తానుగా నమ్మే పైత్యం మరో ఎత్తు. వివాదాస్పద రీతిలో పోలీసుల అదుపులోకి వెళ్లిన డేరా బాబా అలియాస్ గుర్మిత్ రామ్ రహీమ్ ఎపిసోడ్ గుర్తుంది కదా? ప్రైవేటు సైన్యంతో పాటు.. నానా హడావుడి చేసిన అతగాడి జోరుకు కళ్లాలు వేసిన చట్టం దెబ్బకు అయ్యగారు జైల్లో చిప్పకూడు తింటున్నవైనం తెలిసిందే.

ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో పాటు, వివిధ కేసుల్లో డేరాబాబా జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత 23 నెలలుగా సిర్సా జైల్లో డేరా బాబా ఉంటున్నాడు. తాజాగా అతని మనసు వ్యవసాయం మీదకు మళ్లింది.

ఆశ్రమంలో వ్యవసాయం చేసుకుంటానని… తనకు పెరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. తాను చేసింది క్షమించరాని నేరాలేం కావని, పైగా జైల్లో తన ప్రవర్తన చాలా బాగుందని దరఖాస్తులో పేర్కొన్నాడు. పెరోల్ కు తాను అర్హుడినే అని చెప్పాడు. జైలు అధికారులు ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తున్నారు.

- Advertisement -