నిత్యామీనన్ ‘ప్రాణ’ ఫస్టులుక్..

424
- Advertisement -

నిత్యామీనన్ ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్‌. తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి నిత్యామీనన్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించింది. తనకి నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెప్పే ఆమె స్వభావమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. తెలుగులో ‘అ’ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించిన నిత్యా ప్రస్తుతం మరో కొత్త చిత్రంలో నటిస్తోంది.

Nithya Menon

అయితే తాజాగా నిత్యామీనన్‌ ‘ప్రాణ’అనే సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ ,హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా మొత్తం మీద వున్న ఆర్టిస్ట్ ఒక్క నిత్యామీనన్ మాత్రమే. ఆమె చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది .. అదే ఈ సినిమా ప్రత్యేకత. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా నిత్యామీనన్ ఫస్టులుక్ దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబడింది. ఈ ఫస్టులుక్ .. ఈ సినిమా కాన్సెప్టుపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది.

- Advertisement -