టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటాడు. అలాగే కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే ఎవరి క్యాచ్ అయిన పట్టిన వెంటనే ధావన్ తొడ కొట్టడం చూస్తుంటాం. ఈ తొడ కొట్టడం విషయంపై స్వయంగా తానే వివరించాడు.
ఓ ఇంటర్వ్యూలో ధావన్ మాట్లాడుతూ.. తాను గతంలో ఆస్ట్రెలియా టెస్ట్ మ్యాచ్‌లో షేన్‌వాట్సన్ క్యాచ్ పట్టినప్పటి నుంచి ఇలా తొడ కొట్టడం మొదలు పెట్టానని చెప్పాడు. అయితే తనకు కబడ్డి ఆట అంటే ఇష్టమని, ఆ ఆటని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తానని, ఆ ఆటలో మాదిరిగా తొడకొట్టడం చాలా ఇష్టం అని పేర్కొన్నాడు.
ఈ తొడ కొట్టడం అనేది నా మనసులో నుంచి వచ్చే పోజ్ అని, అభిమానులు కూడా దీన్ని ఇష్టపడతారని చెప్పాడు. అయితే బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది అభిమానులు కబడ్డీ స్టైల్లో ఫోజ్ ఇవ్వాలని అడుతుంటారని చెప్పుకొచ్చాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.