దుమ్ములేపుతున్న విక్రమ్ ట్రైలర్‌..

280
- Advertisement -

చియాన్‌ విక్రమ్ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఏర్పరచుకున్న హీరో ‌. విక్రమ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారు. ఆయన హీరోగా 2003లో వచ్చిన ‘సామి’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా ‘లక్ష్మీనరసింహ’ పేరుతో తెరకెక్కించారు. ఇక్కడ కూడా ఈ కథ సూపర్ హిట్ అయ్యింది. అయితే 15 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ కథకు తమిళంలో సీక్వెల్‌గా ‘సామి స్క్వేర్’ వస్తోంది.

తమిళనాట మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సిరీస్ హరికి తెలుగునాట కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పోలీస్ స్టోరీలను ఆసక్తికరంగా తెరకెక్కించే హరి.. ఇప్పుడు విక్రమ్‌ను మరోసారి పవర్‌ఫుల్ పోలీస్‌ అధికారిగా చూపిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Vikram

తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను వదిలారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్‌ చేశారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా..’ అంటూ విక్రమ్‌ చెప్పె డైలాగ్‌లు.. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కోసం హీరో విక్రమ్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు.

‘సామి స్క్వేర్‌’లో జాన్‌ విజయ్‌, ప్రభు, సూరి, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్‌ సినీ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రానికి సీక్వెల్‌ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ట్రైలర్‌ కూడా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ బాధ్యతల్ని దర్శకుడు హరినే చూసుకుంటున్నారు.

- Advertisement -