గెలుపు మాదే..కాదు మాదే

209
karnataka
- Advertisement -

కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప సర్కారు రేపే బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో సర్వాత్రా ఆసక్తి నెలకొంది. అయితే బీజేపీ,జేడీఎస్,కాంగ్రెస్ నేతలు గెలుపుపై ఎవరిధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. గెలుపు మాదంటే మాదని కుండబద్దలు కొడుతున్నారు.

సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని దేవేగౌడ న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రేపు జరిగే బలపరీక్షలో గెలుపు తమదేనని స్పష్టం చేశారు. జెడిఎస్, కాంగ్రెస్ కూటమికి ప్రజల మద్దతు ఉందని జెడిఎస్ నేత రేవణ్ణ తెలిపారు. కేంద్రం ఒత్తిడితోనే గవర్నర్ .. బిజెపికి అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. విశ్వాస పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని… తమకు 118 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉందని వెల్లడించారు.

రేపు జరిగే బలపరీక్షలో తాను విజయం సాధిస్తానని సీఎం యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాము పూర్తి మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు.సభలో సంఖ్యా బలం నిరూపించుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తామన్నారు.

మొత్తం కర్నాటకలో 222 స్ధానాలుండగా 220 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ 122. బిజెపి- 104,కాంగ్రెస్- 78,జెడిఎస్- 38,ఇతరులు-2 స్ధానాల్లో విజయం సాధించారు. 104 ఎమ్మెల్యేలున్న బీజేపీ…విపక్ష ఎమ్మెల్యేల గైర్హాజరి ద్వారా బలపరీక్షలో నెగ్గాలని భావిస్తోంది.

- Advertisement -