‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్ వాయిదా..

246
Bharat Ane Nenu Success Meet Postponed
- Advertisement -

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేనే. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కని ఈ సినిమాలో మహేష్‌ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు.

Bharat Ane Nenu Success Meet Postponed

ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. విడుదలైన రెండు రోజులకే వరల్డ్ వైడ్‌గా వంద కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును లిఖించింది. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ చిత్రంపై సినీ ప్రముఖుల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ చిత్రాన్ని చూసి చిత్ర బృందాన్ని అభినందించారు.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావటంతో సినిమా నిర్మాతలు భారీ స్థాయిలో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఏప్రిల్‌ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్‌ పాఠశాల గ్రౌండ్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు కూడా ప్ర‌క‌టించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త తేదీని నిర్ణయించి వేదిక వివరాలను వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

- Advertisement -