పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గించే తదితర ప్రయోజనాల కోసం వచ్చే సెప్టెంబర్ లో ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సుల ప్రారంభిస్తుందని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
శాసన మండలిలో ప్రభుత్వ విప్ పాతూరి సుథాకర్ రెడి అడిగిన ప్రశ్నలు, అనుభంద ప్రశ్నలకు ఆయన సమాదాన మిస్తూ రాష్ట్రం లో టీఎస్ ఆర్టీసీ “ఫేమ్ ఇండియా పథకం” కింద కేంద్రం సహకారంతో 100 ఏసీ – ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టనుందన్నారు. ఇందులో తొలిదశలో 40 బస్సులను ప్రారంభించేందుకు నిర్ధేశాలు అందించామని తెలిపారు.
అలాగే రెండో దశలో మరో 60 బస్సులను ప్రవేశపెడుతున్నమని వివరించారు. వీటిని నడపడానికీ ఆపరేటింగ్ సంస్థలను టెండర్ విధానం ద్వారా పిలిస్తే 5 సంస్థలు పాల్గొనగా ,సిద్ధార్థ్ ఇన్ ఫ్రా టెక్ & సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తోలి విడత 40 బస్సులను నడిపే బ్రిడ్ దక్కించుకోగా వారికి బిడ్డర్ ను అప్పగించడమైందని పేర్కొన్నారు.
ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులను ఒక సారి చార్జీ చేస్తే కనీసం 4 గంటలు పనిచేస్తుందని, ఇలా 250 కిమీ దూరాన్ని 60 కిమీ వేగంతో ప్రయాణం చేసే సారమర్థ్యం ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ బస్సుల తో పర్యావరణం కాపాడటంతో పాటు తక్కువ ఖర్చు తో ఆర్టీసీ నష్టం తగ్గించుకోవచ్చనేది వీటి ప్రధాన లాభాలు గా ఉన్నాయని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.