రజనీ, పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీపై రానా కామెంట్‌..

318
Rana Daggubati About Pawan Kalyan And Rajinikanth Political Entry ...
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల పొలిటికల్‌ ఎంట్రీపై రానా దగ్గుబాటి కామెంట్‌ చేశారు. వీరిద్దరూ ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సినిమా వాళ్ళు ఏ రంగంలోనైనా రాణిస్తారంటూ చెప్పుకొచ్చాడు.

రజనీ, పవన్‌ లు సినీ రంగంలో లెజెండ్స్ అని చెప్పిన రానా.. తమకు నచ్చిన మార్గాలను వారు ఎంచుకున్నారని, వారు ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తులని ప్రశంసించారు.

 Rana Daggubati About Pawan Kalyan And Rajinikanth Political Entry ...

కాగా…‘భవిష్యత్ లో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా?’ అనే ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, రాజకీయనాయకుడి పాత్రలో సినిమాల్లో నటించడమే తప్ప, నిజజీవితంలో మాత్రం రాజకీయాల్లోకి రానని చెప్పారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా స్పందిచారు రానా దగ్గుబాటి.

- Advertisement -