నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “జై సింహా”. దుబాయ్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తైంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
డిసెంబర్ 24న విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో ఆడియో వేడుక జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సి. కళ్యాణ్ బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటుంది అన్నారు.
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.