అజ్ఞాతవాసి కోసం ఎదురుచూస్తున్నా..

198
Ram Chran on Agnyaathavaasi Teaser
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అజ్ఞాతవాసి’.  జనవరి 10 సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు రోజుల క్రితం విడుద చేసిన సినిమా టీజర్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.   ఈ టీజర్‌ను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, హీరో రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు.

‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.. పీకే (పవన్‌కల్యాణ్‌) అత్యుత్తమంగా కనిపించారని రాంగోపాల్ వర్మ  ఫేస్‌ బుక్‌లో కామెంట్ చేయగా సంక్రాంతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు. బాబాయ్‌ ఎట్‌ హిజ్‌ బెస్ట్‌. టీజర్‌లో ఆయన ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ చాలా నచ్చిందన్నారు.

ఇదిఇలా ఉండగా అజ్ఞాతవాసి టీజర్‌  యూట్యూబ్‌ ట్రెండింగ్‌ మారింది. ఇప్పటి వరకు 78.86 లక్షల మంది వీక్షించగా… 4,49,001 మంది లైక్‌ చేశారు.  పవన్ సరసన కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఖుష్బూ, బొమాన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -