‘పద్మావతి’పై కంగనా కామెంట్‌..

217
Kangana Ranaut goes tit for tat on Deepika Padukone
- Advertisement -

‘పద్మావతి’ విషయమై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఇంకా చల్లారలేదు. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజస్థాన్‌లో కర్ణిసేన గత కొన్ని రోజులగా ఆందోళనలు నిర్వహిస్తోంది. బీజేపీ నేతలు ఈ మూవీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ సినిమా నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీం కోర్టు మూడుసార్లు తిరస్కరించింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమాకు వ్యతిరేకంగా ఉన్నారు. దీనిపై అలనాటి నటి షబానా అజ్మీ స్పందిస్తూ సినీ ప్రముఖుల చేత ‘పద్మావతి’కి మద్దతు ఇస్తున్నట్లు సంతకం చేసిన ఓ పిటిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీకి అందజేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌లో దాదాపు అందరు సినీ ప్రముఖులూ సంతకాలు చేశారు. కానీ కంగనా రనౌత్‌ మాత్రం ఇంకా సంతకం చేయలేదు.

Kangana Ranaut goes tit for tat on Deepika Padukone

దాంతో కంగన దీపికపై ఈ రకంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా కంగన స్పందించారు. షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్‌, రైట్‌ వింగ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని అందుకే ఇంకా పిటిషన్‌లో సంతకం చేయలేదని తెలిపారు. ఈ విషయంలోతనకంటూ కొన్ని అభిప్రాయాలు, ఐడియాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను దీపికకు పూర్తి మద్దతు ఇస్తున్నానని ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని చెప్పారు.

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదల విషయమై సంజయ్‌ ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్‌తో సమావేశమయ్యారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -