మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ న్యూస్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. అందుకే ఆయన జీవితంపై ఒక సినిమా గురించిన ప్రకటన రాగానే వెంటనే మరో 3 ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ వచ్చేశాయి. తండ్రి జీవితంపై సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ చెప్పగానే.. రాంగోపాల్ వర్మ ఓ యాంగిల్ స్టోరీతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను.. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో యాంగిల్ లో లక్ష్మీస్ వీరగ్రంథం అంటూ మరో కథను రూపొందిస్తున్నాడు. అయితే ఈ లక్ష్మీ వీరగ్రంథం సినిమా ప్రారంభం కానుందట. అంతేకాదు ముహుర్తపు తేదీని కూడా ప్రకటించారు చిత్ర బృందం.
తాజాగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాకు ముహూర్తాన్ని నవంబర్ 12 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్యలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ సమాధి వద్దే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. జయం మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ముహూర్తానికి సంబంధించిన ఇన్విటేషన్ ను ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ముహూర్తపు పూజకు అందరూ ఆహ్వానితులే అని ఇన్విటేషన్ లో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు.