ప్రీ రిలీజ్‌కు జవాన్‌ సిద్ధం..!

295
Jawaan Movie Pre Release Function Date
- Advertisement -

మెగా హీరో సాయి ధరం తేజ్ విజయం కోసం గతేడాది నుంచి ప్రయత్నిస్తున్నాడు. తిక్క.. విన్నర్.. చిత్రాలు ఆశించిన స్థాయి రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు జవాన్ సినిమాతో డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు తేజు. బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాని ఒక కొత్త కథతో తెరకెక్కించాడు దర్శకుడు బీవీఎస్‌ రవి. ప్రతీ ఇంటికీ ఓ జవాన్ ఉండాలి అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు.. ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. హైద్రాబాద్ లోని నెక్ లేస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో.. మెగా ఫ్యాన్స్ మధ్య ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలియచేశారు.

Jawaan Movie Pre Release Function Date

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల జాబితా కూడా సిద్ధమైపోయిందట. మెగా ఫ్యాన్స్ ను అలరించే విధంగా గెస్టుల లిస్ట్ ఉంటుందని తెలుస్తోంది. నవంబర్ 19న జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు నిర్మాతలు. దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై జవాన్ చిత్రం రూపొందగా ఈ మూవీలో మెహ్రీన్ కౌర్ పీర్జాదా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సెన్సార్ చేయించనున్నట్లుగా సమాచారం. మరి మన మెగా హీరో ఈ సినిమాతో అయినా హిట్‌ కొడతాడో చూడాలి.

- Advertisement -