రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి ధోని, కోహ్లీ..!

209
Dhoni & Kohli restaurant in Mumbai
- Advertisement -

ఒకరు టీమిండియా కెప్టెన్‌ మరొకరు మాజీ కెప్టెన్‌. వీరిద్దరు మైదానంలో ఉన్నారంటే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఎందుకంటే ఒకరు యాంగ్రీ మెన్‌ కాగా మరొకరు మిస్టర్ కూల్. జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన వీరిద్దరు కలిసి వ్యాపారంలో అడుగుపెట్టారట. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dhoni & Kohli restaurant in Mumbai
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ధోనీ, కోహ్లీ రెస్టారెంట్‌ వెలిసింది. అదేంటి వారిద్దరూ కలిసి రెస్టారెంట్‌ వ్యాపారం ఎప్పుడు ప్రారంభించారబ్బా..? అని అనుకుంటున్నారా! అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ధోనీ, కోహ్లీ మీద అభిమానంతో ముంబయికి చెందిన ఓ వ్యక్తి వీరి పేరు మీద రెస్టారెంట్‌ పెట్టారు. ముంబయిలోని కాండీవలి ఈస్ట్‌ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ ఉంది.

అయితే ఈ రెస్టారెంట్‌తో ధోనీకి, కోహ్లికి ఎటువంటి సంబంధం లేదు. క్రికెట్‌ అభిమానులను ఆకర్షించేందుకు ఇలా పేరు పెట్టారు.  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోనీ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సిద్దమవుతుండగా తొలి వన్డే అక్టోబర్‌ 22న  జరగనుంది.

- Advertisement -