హీరో రాజశేఖర్ తల్లి మృతి..

163
Rajasekhar's Mother Passes Away
- Advertisement -

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

ఈ ఉదయం ఆమె కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సంతానంలో రెండో వ్యక్తి రాజశేఖర్. ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం 5 గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి, అక్కడ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -