నానితో ప్లాన్ చేస్తున్న విక్రమ్..

180
Nani, Vikram Kumar to team up?
- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నాని వరుసగా ప్రేమకథలు చేస్తూ.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.. ఇప్పుడు నానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. ఆలస్యం చెయ్యకుండా ఓ సినిమా పూర్తవకముందే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు నాని.

సినిమా సినిమాకు వేరియేషన్ చూపుతూ.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. దీంతో పేరున్న దర్శకులు కూడా నానీతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్.. నానీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే అతడు నానీని కలిసి ఒకట్రెండు కథలు కూడా వినిపించడని తెలుస్తోంది. వాటిలో ఓ వినూత్న కథతో సినిమా తెరకెక్కనుంది.

కథల విషయంలో జాగ్రత్తగా అడుగులేసే నానీ.. విక్రమ్ చెప్పిన లైన్ నచ్చడం వల్లే అతడితో సినిమాకు ఓకే చేశారని టాక్.ప్రస్తుతం నానీ ‘ఎంసీఏ’ తో బిజీగా ఉన్నాడు. మరి అన్నీ ఓకే అయితే.. విక్రమ్ – నానీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో చూడాలి.

- Advertisement -