సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు అన్నారు నిర్మాత నాగవంశీ. నేనిక్కడ డబ్బులు పెట్టి ఇళ్లు కట్టుకుని ఏపీకి వెళ్లి ఏం చేస్తా?, సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుదనే విషయం నాకు తెలియదన్నారు.
ఎమోషనల్‌గా ఏమైనా జరిగితే ఎవరం ఏమీ ఆపలేం. జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఏ థియేటర్లో ఏం జరుగుతుందో ఫాలో అప్ చేయగలుగుతాం అని చెప్పలేం అన్నారు. సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు… తెల్లవారుజామున నాలుగు నుంచి సినిమా పడితే చాలు అన్నారు.
ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక.. ముందు ఆయన సినిమా ఉంది… ఏం తేలుస్తారో చూద్దాం అన్నారు. నేను ఏపీకి వెళ్లి ఏం చేస్తాను? పవన్‌గారు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.
Also Read:సారీ చెప్పిన సీవీ ఆనంద్