రాజ’శేఖర్’ మూవీ నుండి లిరికల్ సాంగ్..

79
Shekar
- Advertisement -

యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ సినిమాలో నటించారు. ఈ సినిమాకి జీవిత దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో శివాని రాజశేఖర్ కనిపించనుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘చిన్ని చిన్ని ప్రాణం.. చిందులాడే పాదం.. నా కోసం.. నవ్వు పంచేనా’ అంటూ ఈ పాట సాగుతుంది. హీరో.. హీరోయిన్ ఇద్దరూ కూడా తమ పసి బిడ్డను చూసుకుని మురిసిపోయే నేపథ్యంలో వచ్చేపాట ఇది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చిన్మయి,హేమంత్ మహ్మద్ ఆలపించారు. పాట ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. ఈ సినిమాతో ముస్కాన్, ఆత్మీయ రాజన్ కథనాయికలుగా కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మలయాళంలో ‘జోసెఫ్’ సినిమాకి ఇది రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కథాపరంగా ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

https://youtu.be/J7LUOOL–54
- Advertisement -