రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు..!

235
Balapur laddu auction to set new records this year
- Advertisement -

బాలాపూర్ లడ్డూకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హైదరాబాదులో ఖైరతాబాద్ గణేషుడు అత్యంత భారీకాయుడైతే…బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతుంటుంది. బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్న వారింట సిరిసంపదలు పెరుగుతాయన్న నమ్మకం.

బాలాపూర్ లడ్డూ సొంతం చేసుకునేందుకు ఉత్సాపడేలా చేస్తుంది. దీంతో ఏటికేడు బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలుకుతూ వస్తోంది. అందుకే బాలాపూర్‌ లడ్డుకు అంత క్రేజ్‌.

గత ఏడాది బాలాపూర్ లడ్డూ 14.65 వేల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 15.60 లక్షల రూపాయల రికార్డు ధరకు విజన్ ఇండియా ఎండీ నాగం తిరుపతి రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరని ఆయన చెప్పారు. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం 1994 నుంచి ప్రారంభమైంది.

తొలి ఏడాది 450 రూపాయలకు వేలంలో సొంతం చేసుకోగా, ఏటికేడు దాని ధర పెరుగుతూ వస్తోంది. 21 కేజీల విలువైన బాలాపూర్ లడ్డూ 15,60,000 రూపాయలు కావడం విశేషం.

- Advertisement -