ఆ వార్త రూమర్‌ అన్న దిల్ రాజ్ !

203
Rumours on Mahesh - Ileana are False
Rumours on Mahesh - Ileana are False
- Advertisement -

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు, ఇలియానా నటించిన పోకిరి సినిమా బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసింది. ఈ సినిమాలో మహేష్‌, ఇలియానాల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ అయింది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సౌత్ సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పి బాలీవుడ్లో సెటిలైన హీరోయిన్ ఇలియానా…. అక్కడ పెద్ద స్టార్ అయ్యేందుకు చాలా కష్టపడుతోందని, అక్కడ నిరాశే ఎదురు కావడంతో మళ్ళీ టాలీవుడ్ కి వస్తుందని అని చెప్పుకొచ్చారు. అయితే ఏ మాత్రం నిజం లేదని, ఇదంతా ఓ రూమర్ అని తేలింది.

mahesh ileana

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ‘స్పైడర్’ మూవీ షూటింగ్ కంప్లేట్ చేసుకుని, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ మరియు వంశి పైడిపల్లి డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి మూవీ రీసెంట్ గా మొదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అశ్విన్ దత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మేలో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో ఇలియానా కథానాయిక అంటూ రూమర్స్ పుట్టించారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. ఇలియానా ఇందులో నటించడం లేదని, చిత్ర హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్‌ఫాం యలనేదని రాజు స్పష్టం చేశాడు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, అసలు ఇలియానాను తాము సంప్రదించలేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు.

ఇలియానా త్వరలో ‘బాద్‌షాహో’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె అజయ్ దేవగన్ ప్రియురాలిగా, రాయల్ లేడీ పాత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లు చేసింది.

- Advertisement -