భారీ ధరకు బాలాపూర్ గణేష్ ల‌డ్డూ..

103
- Advertisement -

హైద‌రాబాద్‌లోని అంత్యంత ఉత్కంఠను నెలకొల్పె బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికింది. వేలం పాట‌లో ఆ ల‌డ్డూ రూ.18.90 ల‌క్ష‌లకు అమ్ముడుపోయింది. ఈ ల‌డ్డూను మ‌ర్రి శ‌శాంక్ రెడ్డి, ర‌మేష్ యాద‌వ్ ద‌క్కించుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం పోలీసులు న‌గ‌ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నగరంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వెళ్లే వైపుగా శోభాయాత్రలో పాల్గొనే వాహనాలను మిన‌హా ఇతర వాహనాలను అనుమతించట్లేదు. గత ఏడాది కరోనా వల్ల గణేష్ శోభాయాత్ర‌ ఉత్సవాలు జరగలేదన్న విష‌యం తెలిసిందే. ఈ సారి హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్ బండ్ గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల కోసం వ‌స్తున్నారు.

- Advertisement -