బాహుబలి దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే ఆయన కుటుంబం మొత్తం ఆ సినిమాకు కలిసి పనిచేస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి సతిమణి మరియు కొడుకు మరోక డైరెక్టర్‌తో పని చేయడం విశేషం.
సాయి కొర్రపాటి, రాజమౌళికి మంచి రిలేషన్ ఉండడంతో రమా రాజమౌళిని, కార్తికేయను నాగచైతన్య కొత్త సినిమా యుద్ధం శరణం సినిమాలో భాగస్వామిగా చేశారు .అయితే ఈ సినిమాకు రమా రాజమౌళి కాస్ట్యూమ్స్‌కు సంబంధించిన సూచనలు ఇస్తుండగా రాజమౌళి తనయుడు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాడు. అంతేకాదు కీరవాణి కుమారుడు కాలభైరవ కూడా ఈ సినిమాలో పాటలు పాడాడు. ఇలా మరోసారి జక్కన్న ఫ్యామిలీ మొత్తం కలిసి మరో సినిమాకు పని చేస్తున్నారు. మరి ఈ సినిమాకు జక్కన్న ఏం చేశాడో తెలుసా..?
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి పబ్లిసిస్ట్ అవతారం ఎత్తేశాడు. ఈ వేడుకలో రాజమౌళి – రమ ని చాలా పొగిడారు. కొత్త దర్శకుడైన కృష్ణ టేస్ట్‌కి తగ్గట్టుగా చాలా చక్కగా పనిచేశారని మెచ్చుకున్నాడు. అలాగే సినిమా యూనిట్ కూడా చాలా చక్కగా వర్క్ చేశారని పొగుడుతూ..చైతూకి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. అందుకేనేమో సాయి కొర్రపాటి బ్యానర్ లో రాజమౌళికి సీక్రెట్ ఇన్వెస్ట్ మెంట్ ఉందంటారు.