ఇన్‌స్టాలోకి సోనియా ఎంట్రీ

1
- Advertisement -

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియా గాంధీ సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు.ఇవాళ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించి తన కొత్త పుస్తకం ‘Belonging: A Journey of Love’ తొలి లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

అందరికీ నమస్కారం. ఈ క్షణాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం తొలి రూపాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రేమ, బాధ్యత, నష్టం, మనకు చెందిన స్థానం కోసం అన్వేషణ వంటి అంశాలతో కూడిన కథ ఇది. ఈ పుస్తకం గురించి మరిన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఎదురుచూస్తున్నాను అని సోనియా గాంధీ తన తొలి పోస్టులో పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే ఆమెకు వెయ్యికి పైగా ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.

Also Read:లిక్కర్ ఎంత తాగితే మంచిది?

సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10, 2026న విడుదల కానుంది. ఇందులో ఇటలీలో గడిపిన బాల్యం నుంచి భారతదేశానికి రావడం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం, కుటుంబ జీవితంలోని సంతోషాలు, విషాదాలు, భారత రాజకీయాల్లో ఆమె ప్రయాణం వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

- Advertisement -