మోహన్ భగవత్ జీ..ఎక్కడున్నారు?

10
- Advertisement -

ఓటు చోరీ ఆరోపణలు, ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్ భగవత్ ఎందుకు మౌనంగా ఉన్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ప్రతి అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌).. ఎన్నికల పారదర్శకతకు సంబంధించిన కీలక అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, మతం, సామాజిక విలువలు, శాస్త్ర విజ్ఞానం నుంచి భారతీయులు ఎంతమంది పిల్లలను కనాలనే అంశం వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుందని ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. గోమూత్రంతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చనే వాదనల నుంచి పురాణాలను శాస్త్రీయ వాస్తవాలుగా ప్రచారం చేయడం వరకు అనేక అంశాలపై ఆ సంస్థ స్పందిస్తోందని ఆరోపించారు.

అయితే రైతుల కష్టాలు, విద్యార్థుల సమస్యలు, ఓటు చోరీ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ప్రసంగాలు ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమగ్రత, జవాబుదారీతనం గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు మోహన్ భగవత్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపైనా ప్రియాంక్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న నిరసనలను ఎదుర్కొనేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారంటూ విమర్శించారు.

Also Read:మాజీ సీఎం విజయన్‌కు షాక్

శాంతియుత నిరసనలను నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారా? లేక జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడినట్లుగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణాపై ఆంక్షలు, నిరసనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు.

- Advertisement -