మాజీ సీఎం విజయన్‌కు షాక్

12
- Advertisement -

కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL), విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సంస్థ మధ్య జరిగిన లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

CMRL నుంచి వీణకు చెందిన సంస్థకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న కారణాలు, వాటి స్వరూపంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలన్న అంశం కోర్టు ముందుకు వచ్చింది.

ఈ వ్యవహారంలో పినరయి విజయన్‌తోపాటు ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహమ్మద్ రియాజ్‌లపై కూడా కేసు నమోదు చేయాలంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

Also Read:అరెస్టులకు భయపడం..పోరాటం కొనసాగిస్తా!

కేరళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -